పంచ సూత్రాల అమలుతో వ్యవసాయం లాభసాటి
వీరబల్లి : పంచ సూత్రాల అమలుతో రైతులకు వ్యవసాయం లాభసాటి అవుతుందని, అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం వీరబల్లి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రైతులతో పలు అంశాలపై చర్చించి వారి సమస్యలను, సలహాలను తెలుసుకొని అధికారులకు దిశా నిర్దేశం చేసి వీటికి సంబంధించిన ప్రణాళికలను తయారు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం లాభసాటి కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంచసూత్రాల లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అందించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించనుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో మామిడి రైతులు ఎక్కువగా ఉన్నందున కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని రైతులు కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. రైతులు సంఘంగా ఏర్పడి కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకునే విధంగా చూడాలని, ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామన్నారు.
బ్యాంకు అధికారులతో సమావేశం
రాయచోటి : ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు దృష్టి సారించాలని వ్యవసాయం, ఉద్యాన పంటలు, పశుసంవర్థక రుణాలను ఎక్కువగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫిరెన్సు హాల్ లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎల్‌డీఎం ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ బ్యాంకులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


