6న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతుందని ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో వ్యవసాయం, ఉద్యానం, పట్టుపరిశ్రమ, వైద్య ఆరోగ్యం, డ్వామా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, విద్యుత్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, నీటిపారుదల, పశుసంవర్దకశాఖ, విద్య తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు.. ఆయా శాఖల అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ఉన్న 152 జూనియర్ కళాశాలల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంతో ఈ నెల 5వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మెగా పేరెంట్– టీచర్ సమావేశం నిర్వహించాలని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టీఎన్‌వీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు వివిధ కళాశాల మధ్య బంధం పటిష్టం అవుతుందన్నారు. విధార్థులకు సమగ్ర ప్రగతి నివేదికలు (holistic progress cards) పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొని మెగా పేరెంట్ టీచర్ మీట్‌ను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
8న అప్రెంటీస్ మేళా
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిసెంబర్ 8న కడప నగరంలోని ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు అప్రేంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ మైనారిటీ ఐటీఐ ప్రధానాచార్యులు జ్ఞానకుమార్ తెలిపారు. అర్హత ఉన్న వారు 10వ తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్‌టీసి సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్ పుస్తకం, పాస్‌పోర్టు సైజు ఫోటోతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. ఎంపికై న వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు రూ. 8000 నుంచి రూ.10,000 స్టైఫండ్‌గా కంపెనీ వారు చెల్లిస్తారని తెలిపారు.
కడప ఎడ్యుకేషన్ : కౌశల్– 2025 టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి ముగ్గురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గత నెలలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీ ల్లో కడపలోని చెమ్ముమియాపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని తనిష్కా, తొమ్మిదో తరగతి విద్యార్థిని మమత కౌ శల్ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చాటారు. అలాగే తొ మ్మిదో తరగతి విద్యార్థిని ఎన్.బిందుశ్రీ పోస్టర్ మేకింగ్ పోటీల్లో సత్తాచాటింది. వీరంతా ఈనెల 27న తిరుపతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీ ల్లో పాల్గొంటారని ఇన్‌చార్జి హెచ్‌ఎం టి. ఉమాదే వి తెలిపారు. విద్యార్థినులకు పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం టి. ఉమాదేవి, ఉపాధ్యాయులు రామ సుబ్బమ్మ, గాయత్రి అభినందనలు తెలిపారు.
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్(ఏపీసీ) ప్రేమంత కుమార్ పేర్కొన్నారు. బుధవారం కడపలోని సమగ్రశిక్ష కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనకు సమగ్రశిక్షలోని సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
యువతకు
ఉద్యోగ కల్పనే లక్ష్యం
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మెప్మా –నిపుణుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్పందన లభించిందని రాష్ట్ర రవాణా, క్రీడల, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 15 కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు చేపట్టి 170 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి వారికి ఆఫర్ లెటర్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్ కమిషనర్ ఇ. రవి, జివి రమణ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
6న జెడ్పీ సర్వసభ్య సమావేశం


