చరిత్రాత్మక కట్టడానికి పూర్వవైభవం అభినందనీయం
కలికిరి(వాల్మీకిపురం) : చరిత్రాత్మక కట్టడానికి పూర్వవైభవం తీసుకురావడం అభినందనీయమని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వాల్మీకిపురం మండల పరిధిలోని కూరపర్తి పంచాయతీ కేంద్రంలో పునర్ నిర్మించిన పురాతన కోటను గురువారం పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాలు సాంప్రదాయాలకు నెలవుగా ఉండేవని, అలాంటి వాటి పట్ల గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధతో పునర్ నిర్మాణానికి పూనుకొని పూర్తి చేయడం గర్వకారణమన్నారు. కోట బురుజుపైన గల శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి కోట చరిత్రను తెలుసుకున్నారు. కోటలో కలియతిరిగిన ఎంపీ కోట అభివృద్ధికి కృషి చేసిన స్థానిక సర్పంచ్ చిట్టెమ్మ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పులి శివకుమార్‌రెడ్డిలను అభినందించారు. కార్యక్రమంలో ఏపీ ఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు చింతల సాయిక్రిష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మల, నాయకులు నీళ్ల భాస్కర్, అబ్దుల్ కలీం, ఆనంద, సుధాకర్, చికెన్ మస్తాన్, సైఫుల్లా, షాహెద్, లక్ష్మీనారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, కూరపర్తి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి


