ఎంపీడీఓ కార్యాలయంలో వినతుల స్వీకరణ
మదనపల్లె: రాజంపేట ఎంపీ, వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి గురువారం మదనపల్లెకు వస్తున్నారని ఆ పార్టీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ మిథున్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 10:30 గంటలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం చేరుకుని, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. అనంతరం అక్కడే రూరల్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. మిథున్‌రెడ్డి రాక సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ పర్యటనపై మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, వైఎస్సార్‌సీపీ మదనపల్లె రూరల్, రామసముద్రం మండల అధ్యక్షులు దండు కరుణాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు హర్షవర్దన్‌రెడ్డి, వెలుగు చంద్ర తదితరులతో చర్చించారు.
పీలేరు: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి బుధవారం పీలేరు పట్టణంలో పర్యటిస్తారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దండు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు వివిధ ప్రైవేట్ కార్యక్రమాలకు ఎంపీ హాజరవుతారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని ఆయన కోరారు.


