ఇంద్రజాల పోటీల్లో అబ్బురపరిచిన ప్రదర్శనలు
రాజంపేట టౌన్ : ఆంధ్రప్రదేశ్ మ్యాజిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాజంపేట పట్టణంలోని వజ్రం ఫంక్షన్ హాల్‌లో 41వ మ్యాజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇంద్రజాలికులు యూపి.రాయుడు, జేవీఆర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ పోటీలను నిర్వహించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 148 మంది ఇంద్రజాల కళాకారులు పాల్గొని మ్యాజిక్ ప్రదర్శించారు. మాయాలోకం–2 పేరుతో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా ఇంద్రజాలికుల సంఘం అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి సుజనకుమార్, కోశాధి కారి నందకిషోర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శనలు ప్రేక్షకులను అబ్బురపరి మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. మ్యాజిక్ పోటీలు, ఇంద్రజాల ప్రదర్శనలు విజయవంతమయ్యేందుకు చెర్ర్‌సీస్, ఫ్యూచర్‌మైండ్, శ్రీసాయివిద్యాలయ స్కూల్ యాజమాన్యాలు తమవంతు సహకరించాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రా ష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రముఖ రంగస్థల నటుడు సింగంశెట్టి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
ఆంధ్రప్రదేశ్ మ్యాజిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 41వ మ్యాజిక్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన మ్యాజిక్ పోటీల్లో జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానాన్ని సుభాని, ద్వితీయ స్థానాన్ని మహమ్మద్ ఇబ్రహీం, తృతీయ స్థానాన్ని లతీశ్వర్‌లు కై వసం చేసుకున్నారు. సీనియర్స్ విభాగంలో ప్రథమ స్థానాన్ని సురేష్, ద్వితీయ స్థానాన్ని శంకర్, తృతీయ స్థానాన్ని బాచి కై వసం చేసుకున్నారు.
రాయుడికి మ్యాజిక్ స్టార్‌బోస్ పురస్కారం
రాజంపేటకు చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు, జాదురత్న అవార్డు గ్రహీత యూపి.రాయుడు మ్యాజిక్ స్టార్‌బోస్ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో యూపి.రాయుడిని ప్రముఖ ఇంద్రజాల కళాకారులు ఘనంగా సత్కరించారు.


