రాఘవేంద్ర ‘దక్షత’కు పురస్కారం
రాయచోటి టౌన్: ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) గుండాల రెడ్డి రాఘవేంద్రను ప్రతిష్టాత్మక ‘దక్షత’ అవార్డు వరించింది.రాయచోటికి చెందిన ఈయన 2019 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఒడిశా–చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లల్లో రాఘవేంద్ర కీలకంగా వ్యవహరించారు. ఈయన దక్షతకు పురస్కారం లభించింది.నకృల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసినందుకు గతంలో ఒడిశా ప్రభుత్వం నుంచి డీజీపీ డిస్క్ పురస్కారం పొందారు
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీక రించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 3వ తేదీ ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పత్రికకు అందజేసిన ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటితోపాటు గ్రామ, మండల, రెవెన్యూ, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని పేర్కొన్నారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.ఈసందర్భంగా రెడ్డెమ్మతల్లీ దీవించమ్మా అంటూ వేడుకున్నారు. అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉద యం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. హిందువులతోపాటు ముస్లీమ్‌లు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి ఫూజలు నిర్వహించారు.


