బ్రేక్ సిస్టం సమస్యతో ఆగిన నంద్యాల డెమోరైలు
ఓబులవారిపల్లె: రేణిగుంట–నంద్యాల డెమో ప్యాసెంజర్ రైలుకు బ్రేక్ సిస్టం సమస్య తలెత్తడంతో ఆదివారం ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు రేణిగుంటలో బయలుదేరాల్సిన రైలు ఇంజిన్‌లో సమస్య రావడంతో మధ్యాహ్నం మూడున్నరకు మరో ఇంజిన్‌ను జోడించి పంపించారు. ప్రతి స్టేషన్‌లో ఆగిపోయేది. రైల్వే మెకానిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా మరమ్మతు చేయలేకపోయారు. రాత్రి 9 గంటలకు ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్‌కు రాగానే బ్రేకుల్లో సమస్య తలెత్తడంతో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రైల్వే అధికారులు తిరుపతి–గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓబులవారిపల్లిలో స్టాపింగ్ కల్పించి వారిని పంపించారు. గంటల తరబడి రైలు ఆలస్యం కావడం, బ్రేక్ సిస్టంలో సమస్యలు రావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
బ్రహ్మంగారిమఠం: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, భద్ర య్యస్వామి, బ్రహ్మయ్యస్వామి, దత్తస్వామి లతో పాటు రెండోభార్య కుమారులు కలసి పా ర్క్‌లో ఉన్న బ్రహ్మంగారి విగ్రహానికి క్షీరాభిషే కం చేశారు. రాత్రికి మహానంది దేవాలయం నుంచి వచ్చిన తలంబ్రాలతో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం నిర్వహించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
