
● తప్పని అగచాట్లు
బస్సులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎప్పుడో ఒకటి రాగానే ప్రయాణికులు బస్సుల కోసంపరుగులు పెడుతూ సీట్ల కోసం ఎగబడ్డారు. దసరా, సంక్రాంతి పండుగల సమయంలో బస్సుల్లో సీట్ల కోసం ఎలాంటి అగచాట్లు పడతారో అలాంటి పరిస్థితి కనిపించింది. అయితే కనీసం ముందస్తుగా బస్సులు ఉండవన్న సమాచారాన్ని ఆర్టీసీ అధికారులు ఇచ్చి ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకునే వారమని పలువురు లబోదిబోమంటున్నారు. మదనపల్లె, రాయచోటి, రాజంపేట, పీలేరు బస్టాండ్లలో వచ్చిన బస్సులు పూర్తిగా రద్దీగా ఉండడంతో వెళ్లలేక పలువురు తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. జిల్లాలో మదనపల్లె–1, 2తోపాటు పీలేరు, రాజంపేట, రాయచోటి డిపోల నుంచి ప్రధాని సభకు భారీగా బస్సులు వెళ్లగా మిగిలిన కొన్ని బస్సులను ప్రయాణీకులకు కేటాయించారు. అయితే దూర ప్రాంతానికి సంబంధించి రాత్రి పూట సర్వీసులైన బెంగుళూరు, హైదరాబాదు చైన్నె, విజయవాడ తదితర వాటిని యదావిధిగా నడిపారు. ఏది ఏమైనా కూటమి సర్కార్ పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ప్రతి కార్యక్రమం సందర్భంగా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.