ప్రజల గొంతుగా నిలిచి ప్రశ్నిస్తే ప్రభుత్వానికి నచ్చదు..’ సాక్షి’పై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపుగా వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు ప్రాతికేయులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోంది. పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేయడంపై సీనియర్ జర్నలిస్టులు, వివిధ సంఘాల నేతలు ఖండిస్తున్నారు.
ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే యత్నం
విమర్శనాత్మకమైన, స్వతంత్రమైన, పరిశోధనాత్మకమైన పత్రికా స్వాతంత్య్రం ఏ ప్రజాస్వామిక రాజ్యానికికై నా జీవనాడి వంటిది అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా విముక్తి ప్రధాత నెల్సన్ మండేల అభిప్రాయం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నించే గొంతుకల పట్ల, ప్రత్యేకించి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసు కేసులు బనాయించి రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టి వ్యవహారిస్తోంది. వీటిని పరిశీలిస్తే రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ ఉందా అనే అనుమానం సహజంగానే తలెత్తుతుంది. ఇది కేవలం సాక్షి సమస్య కాదు. ఈరోజు ఇది సాక్షికి సమస్య కావచ్చు. పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు మేల్కొకోకపోతే ఇది రేపు అందరికీ సమస్యగా పరిణమిస్తుంది.
– ఎ.రఘునాథరెడ్డి, కో ఆర్డినేటర్,
రాయలసీమ ఆకాంక్షల పౌర వేదిక, కడప
ఎడిటర్‌పై వేధింపులు తగదు
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసుల వేధింపులు తగదు. పత్రికల్లో సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలను ప్రచురిస్తుంటారు. దానిపై ప్రభుత్వానికి అభ్యంతరాలుంటే వివరణ ఇవ్వాలి తప్ప కేసులు బనాయించి బెదిరించాలని చూడడం సరికాదు. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న ధోరణులు హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతల పోకడలను తలపిస్తున్నాయి. పత్రికల గొంతుకను నొక్కా లని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – మోపూరి బాలకృష్ణారెడ్డి,
జిల్లా అధ్యక్షులు ఏపీయూడబ్ల్యుజే,
ఆక్షేపణీయం
రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర మీడియాది. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న ’సాక్షి’పై కక్ష పెంచుకొని ఆ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. సోదాల పేరుతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదు. ఇది ఆక్షేపణీయం. – యమలా సుదర్శనం,
మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు
బరితెగింపు
పత్రికలను వేధించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదుచేయడంసరికాదు. ప్రజాస్వామ్య ముసుగులో ని యంత పాలన సాగిస్తారా. ప్రజల తిరుగుబాటు తో నియంతలు వారు ఏలిన దేశాలనే వదిలి వె ళ్లారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ప్రజలు హ ర్షించరు. ఇప్పటికై నా పాలకులు తీరు మార్చుకోవాలి.
– అక్కులప్ప, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు