
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి
రాజంపేట: విద్యార్థులకు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించాలని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి అన్నారు. గురువారం ఏయూలో స్థిరత్వం వైపు మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉద్భవిస్తున్న సాంకేతికలు, అనే అంశంపై జాతీయస్ధాయి ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ (ఎఫ్‌డీసీ) పోస్టర్‌ను చొప్పా అభిషేక్‌రెడ్డి విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌డీసీ ద్వారా బోధకుల శక్తి నిల్వ వ్యవస్థలు,సీఎఫ్‌డీ విశ్లేషణ, బయోపదార్ధాలు, యంత్ర అధ్యయనం తదితర అంశాలను నేర్చుకోనున్నారన్నారు. ఆధునిక పరిజ్ఞానం ద్వారా అధ్యాపకు లుతమ బోధనలో సాంకేతికతను సమన్వయం చేసుకోవాలన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబరెడ్డి, ప్రిన్సిపాల్ నారాయణ, ఏయూ అడ్మిషన్ల డీన్ బి.జయరామిరెడ్డి, సమన్వయకర్తలు దేవరాజ్‌నాయక్, అజయ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఎఫ్‌డీపీ కార్యక్రమం నవంబరు3 నుంచి 8 వరకు ఆన్‌లైన్ రూపంలో నిర్వహించనున్నారు.