
శాసీ్త్రయతపై విద్యార్థులకు అవగాహన
రాయచోటి టౌన్ : శాసీ్త్రయ దృక్పథంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సు ఉపయోగ పడుతుందని డీవైఈవో నాగయ్య పేర్కొన్నారు. పట్టణంలోని రాయచోటి డైట్ కళాశాలలో జిల్లా సైన్స్ అధికారి మార్లఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలను డీవైఈఓ అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్వాంటం యుగం ప్రారంభం.. బలాలు, బలహీనతలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సెమినార్‌లో ప్రెజెంటేషన్, వైవా, అప్టిట్యూడ్ టెస్టుల ద్వారా పరీక్షించి ప్రతిభ కనబరిచిన సంబేపల్లె మోడల్ స్కూల్ విద్యార్థి బొజ్జ విశ్వానందరెడ్డి, వాల్మీకిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన షామీన్ తాజ్‌లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. శనివారం విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, రెడ్డెయ్య, శ్రీనివాసరాజు, మడితాటి నరసింహారెడ్డి, దిలీప్‌కుమార్, రవిశంకర్‌రెడ్డి, శివలక్ష్మి, రంజిత, హేమంత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.