
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీ
రాయచోటి అర్బన్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాయచోటిలో విద్యుత్తు కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు వారికి మద్ధతునిచ్చి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో జరిగే చర్చలు కార్మికులు, ఉద్యోగులకు అనుకూలంగా లేకపోతే నిరసనను సమ్మె దిశగా తీసుకెళ్లి మద్దతు ప్రకటించామన్నారు. ప్రతి సబ్ స్టేషన్‌లో విధులకు కొత్త కార్మికులు వస్తే వారిని అడ్డుకుంటామని తెలిపారు. యూఈసీడబ్లూయూ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, జేఎల్‌ఎంలకు సర్వీస్ రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగులకు పెన్షన్ భిక్ష కాదని, మంజూరులో కాలయాపన చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు రామనుజన్‌రెడ్డి, ఈశ్వరయ్య, గజేంద్రవర్మ, శివయ్య, ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్, రవీంద్రారెడ్డి, జోష్ణ శృతి, రాధిక, అర్చన, సింధు, భానుమతి తదితరులు పాల్గొన్నారు.