
చెరువులో పడి ఒకరు మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ మండలం శిబ్యాల పరిధిలోని కానుగ చెరువులో పడి పఠాన్‌మున్నా (40) శుక్రవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. శిబ్యాల గ్రామం (చెరువుకు దగ్గరగా ఉన్న ఊరు)లోని తన ఇంటి నుంచి గేదెలను మేపేందుకు పఠామున్నా వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగించారు. పశువులు మేపేందుకు వెళ్లిన ఆధారాలు ఉండటం, తరువాత ఇంటికి రాకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో చెరువులో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. గేదెలు మేస్తూ చెరువులోకి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మున్నా కూడా నీటి మడుగులో నుంచి గేదెలను బయటకు తోలేందుకు వెళ్లి అక్కడ లోతైన గుంటలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులో పడి ఒకరు మృతి