
అనాథ శవానికి అంత్యక్రియలు
మదనపల్లె సిటీ : మానవత్వం పరిమళించింది. పొట్టకూటి కోసం వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూలీలు పీటీఎం మండలం కందుకూరులో విద్యుత్తు షాక్‌తో మృతిచెందారు. మృతదేహాలను స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. కుటుంబీకులు, రక్తసంబంధీకులు ఎవరూ రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హిందూ సంప్రదాయబద్ధంగా ఇద్దరికీ స్థానిక శ్మశాన వాటిలో వారు దహన సంస్కరణలు చేశారు. కార్యక్రమంలో హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్‌సిద్దిక్, సభ్యులు ఆనంద్, సమీర్, నవీన్, సుబ్బు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిక
వీరబల్లి్: మండలంలోని వంగిమల్ల గ్రామామంలో పది కుటుంబాల టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెదివేటి వేరునాగయ్య, చెన్నయ్య, బాలయ్య, అలీ, బాబు, అశోఆక్ కుమార్ తదితరులు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారు మాట్లాడుతూ టీడీపీలో ప్రజలకు ఏమి న్యాయం జరగలేదని, గత జగనన్న పరిపాలనలో జరిగిన సంక్షేమం, ఆర్థికాభివృద్ది దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరామని తెలిపారు. అనంతరం విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలను రాజంపేట వైఎస్సార్‌సీపీ నాయకులు మదన్‌రెడ్డి, తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్పరెడ్డి, తారకేశ్వర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మహిళపై దాడి
మైదుకూరు : పట్టణంలోని అరుంధతీ నగర్‌కు చెందిన మహిళ గద్దె సుజాతపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 11న సుజాత భర్త రవికి, బొచ్చెనపల్లె పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుకు మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ నెల 14న సుజాతపై ముగ్గురు దాడి చేసి గాయపరిచి అవమానపరిచారు. చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చేరిన బాధితురాలు అక్కడ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుపై ఎస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు.
ఝరికోనలో మృతదేహం
కలకడ : మండలంలోని ఝరికోనలో గుర్తుతెలియని మృత దేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రామాంజ నేయులు శుక్రవారం పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల కిందట నీటిలో పడి ఉండవచ్చునని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలన్నారు

అనాథ శవానికి అంత్యక్రియలు