
మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం కానివ్వం
రాజంపేట రూరల్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం కానివ్వమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు.గురువారం మండల పరిధిలోని శేషమాంబపురం పంచాయతీలోని బాలిరెడ్డిగారీపల్లి గ్రామంలో రచ్చబండ, ‘కోటి సంతకాల సేకరణ’కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందులో 10 కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. ఇవి ప్రైవేట్‌పరమైతే వారు లాభాలు దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారని, దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని హక్కుగా పొందే అవకాశాన్ని కోల్పోతారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిన మెడికల్ కళాశాలలను వైఎస్సార్‌సీసీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైఎస్ జగన్ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్న అక్కసుతో సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేట్‌కు అప్పగించాలనుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు పంపి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు. గ్రామ సర్పంచ్ సుబ్బరాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీహరి, రమణ, శ్రీను, రెడ్డెయ్య, సుబ్బరాజు, భా స్కర్, సుబ్బన్న, ప్రేమ్ జితేంద్ర వర్మ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి