
ముగిసిన వర్క్‌షాప్
రాయచోటి: జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలను వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యయవసాయంలో మార్పులు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి జి శివనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా, మండలస్థాయిలో నిర్వహించిన రెండురోజుల వర్క్ షాప్ గురువారం ముగిసింది. వర్క్‌షాప్‌లో జిల్లా, మండలస్థాయి, ప్రైమరీ సెక్టార్ అధికారుల భాగస్వామ్యంతో వార్షిక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీకి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ టీమ్ సభ్యులు బాలాజీ త్రిపాఠి, సుదేష్ణ సేన్, జ్యోతి, రైతు సాధికార సమితి రాష్ట్ర కార్యాలయం నుంచి ఎన్‌వై శాస్త్రి, సౌమ్య కొల్లా, డీపీఎం వెంకటమోహన్, వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ ఎస్‌పీఎం డాక్టర్ నరసింహారెడ్డి, చందనల సమన్వయంతో నిర్వహించారు.
రాయచోటి జగదాంబసెంటర్: ప్రభుత్వ ఆదేశాలు, సూచనల మేరకు రీసర్వే పక్కాగా నిర్వహించాలని ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ పీవీ జయరాజ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేపై రాయచోటిలో అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి రైతుకు జీటీ నోటీసులను అందజేసి వారి సమక్షంలో భూమిని ఆధునిక టెక్నాలజీ రోవర్ ద్వారా సర్వే చేయాలని సూచించారు. అనంతరం రైతులకు రీసర్వే ద్వారా కలిగే లాభాలను వివరించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 18న జిల్లా స్కేటింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ది రోలర్ స్కేటింగ్ అసోసి యేషన్ కార్యదర్శి ఇస్రా యిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు యోగి వేమన యూనివర్శిటీ, డీఎస్‌ఏ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు 37వ అంతర్ జిల్లాల రోలర్ స్కేటింగ్ పోటీలు నవంబర్ 1 నుంచి 5 వరకు కాకినాడలో జరిగే పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో గురువారం నిర్వహించిన టెండర్లలో కొన్నింటికి ఆమోదించి మరి కొన్నింటిని వాయిదా వేసినట్లు ఆలయ సహాయ కమీషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. టెండర్లలో ప్రధానమైన కొబ్బరికాయల విక్రయ హక్కుకు సంబంధించి పోటీదారులు ధరావత్తు మొత్తం చెల్లించినప్పటికీ పాట పాడేందుకు నిరాసక్తత కనబరిచారు.దీంతో కొబ్బరి కాయల టెండరును వాయిదా వేసినట్లు ప్రకటించారు.సప్లయర్స్ డెకరేషన్ సామాన్లు,విద్యుత్ ఫ్లంబింగ్ ఆమాగ్రి సరఫరా,స్టేషనరీ,అరటి ఆకుల,మామిడి తోరణములు, వస్త్రాల సరఫరా,తదితరాలను ఆమోదం తెలిపినట్లు చెప్పారు.పూలమాలల సరఫరా,పాదరక్షలు భద్రపరచు హక్కు,ని రుపయోగ సామగ్రి కొనుగోలు తదితరాలను వాయిదా వేశామని వివరించారు. కడప దేవదాయ శాఖ తనిఖీదారుడు శివయ్య,ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ,మాజీ చైర్మన్‌లు కావలి వీరభాస్కరుడు,వెంకటస్వామి పాల్గొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా జిల్లాలో గల యువకులకు నైపుణ్యాలతో కూడిన డ్రైవింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ వీర్రాజు పేర్కొన్నారు. గురువారం నగర శివార్లలోని ఊటుకూరు జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందులో భాగంగా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ చొప్పున శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల 23 సాయంత్రం 5 లోపు వారి ఆసక్తి పత్రాలను, డీపీఆర్ కాపీలను, ఇతర అటాచ్‌మెంట్లను జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయము, వైయస్సార్ కడప జిల్లా లో సబ్మిట్ చేయాలని కోరారు. ఆసక్తి గల సంస్థలు పూర్తి వివరాలు కోసం కేంద్ర రహదారులు , రవాణా శాఖ వెబ్‌సైట్‌లో నుండి పూర్తి వివరాలు పొందవచ్చన్నారు.

ముగిసిన వర్క్‌షాప్

ముగిసిన వర్క్‌షాప్