
హద్దులు చెరిపి ఆక్రమణకు యత్నం
మదనపల్లె రూరల్ : మండలంలోని కోళ్లబైలు పంచాయతీ శేషాచలనగర్ సమీపంలో ప్రభుత్వ భూమిగా ఉన్న గుట్టను చదునుచేయడంతోపాటు ఆక్రమణకు యత్నించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. మంగళవారం తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి కోళ్లబైలు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్–529లో గుట్టను జేసీబీతో చదునుచేసి, ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ విషయమై స్థానికులను విచారించి, గుట్ట స్వరూప స్వభావాలను మార్చినందుకు రామిశెట్టి రవి, నాగార్జునపై, తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.