
పేద విద్యార్థుల కడుపుకొట్టేందుకే మెడికల్ కాలేజీల ప్రైవ
● చంద్రబాబు దళిత వ్యతిరేకి....
కాదనేవాళ్లు చర్చకు రండి
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం
అధ్యక్షుడు సుధాకర్‌బాబు
రాయచోటి టౌన్ : పేదవిద్యార్థుల కడుపు కొట్టేందుకే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు సుధాకర్‌బాబు ఆరోపించారు. బుధవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముందు నుంచే దళితులంటే చంద్రబాబు నాయుడుకు గిట్టదని అన్నారు. మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తే పేద విద్యార్థులు నష్టపోవడమే కాకుండా ఉన్నత విద్యకు దూరం అవుతారన్నారు. అందుకే చంద్రబాబు పేద దళిత బిడ్డలు చదవకూడదని ప్రైవేటీ కరణ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దళితుల వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలుసన్నారు. కాదనే వాళ్లు చర్చకు వస్తే చర్చిండానికి నేను సిద్ధం అని సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ నేతలను మద్యం కేసులో ఇరికించి బదనాం చేసేందుకు రాజంపేట ఎంపీ మిధున్ రెడిని అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు. ఇది కేవలం పెద్దిరెడ్డి కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షే కారణమన్నారు. తంబళ్లపల్లెలో దొరికిన నకిలీ మద్యం తయారీదారులు ఎవరు..? వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లకొడుతున్న దొంగలు ఎవరో... చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లకు ఒకటి నకిలీ మద్యం బాటిల్ అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు, ఎస్టీలకు ఏమి ఇచ్చావో చెప్పాలని నిలదీశారు. వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకొనేందుకు జగనన్న పోర్స్ పేరిట ఒక టీంగా ఏర్పాటు అవుతున్నట్లు చెప్పారు. పోలీసులతో తలలు పగలకొట్టినా, కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీంఎ అయ్యే వరకు దళితులు అందరూ కలసి పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు.