
ఆర్టీసీ ఎండీతో జిల్లా ఎస్పీ భేటీ
మదనపల్లె రూరల్ : అన్నమయ్యజిల్లాకు విచ్చేసిన ఆర్టీసీ ఎండీ, మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావును, గురువారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని బైపాస్‌రోడ్డు వెన్నెల గార్డెన్స్‌లో భేటీ అయిన వారు ప్రజారవాణా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పోలీస్‌శాఖ సహకారంతో బస్సులు, బస్‌స్టేషన్‌లలో భద్రతను మరింత పెంచుతామని, ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలన్నారు.
వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ..
మదనపల్లె పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.మహేంద్ర, సీఐ మహమ్మద్ రఫీ, ఎస్‌ఐ అన్సర్‌బాషా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆదాయం పెరుగుదలలో
కార్మికుల భాగస్వామ్యం
రాజంపేట : ఆర్టీసీ ఆదాయం పెరుగుదలలో కార్మికుల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారక తిరుమలరావు అన్నారు. గురువారం రాజంపేట డిపోలో ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ ఆదాయానికి కార్మికులు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ కార్మిక సంక్షేమానికి తన వంతుగా కృషిచేస్తానన్నారు. ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రయాణికులతో స్నేహభావంతో మెలగాలన్నారు. సంయమనం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు అప్పలరాజు, చంద్రశేఖర్, డీపీటీఓ రాము, రాజంపేట ఏఎస్పీ మనోజ్‌రాంనాథ్ హెగ్డే, డిపో అధికారి దాసరి కృష్ణమూర్తి, ఆర్టీసీ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎండీ సీహెచ్ ద్వారక తిరుమలరావు

ఆర్టీసీ ఎండీతో జిల్లా ఎస్పీ భేటీ