
దళితుడి భూమిపై కన్ను
ములకలచెరువు : దళితుల భూమి అక్రమంగా తెలుగుదేశం పార్టీ మాజీ నేత జయచంద్రారెడ్డి బామ్మర్ది గిరిధర్ రెడ్డి ఆక్రమించుకున్నాడని దళితుడు మల్లప్ప ఆరోపించాడు. వివరాలు...మండలంలోని పాత ములకలచెరువుకు చెందిన మల్లప్ప భూమికు సర్వే నెంబర్ 197 లో 8 ఎకరాల 54 సెంట్లకుగాను 1/4 వంతు మల్లప్ప తండ్రి రామప్పకు వర్తిస్తుంది. ఎస్సీ వర్గానికి చెందిన వీరి భూమిని తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత, కల్తీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రా రెడ్డికి స్వయానా మేనల్లుడైన గిరిధర్ రెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకొని అధికారుల అండ దండలతో దొంగ పట్టా సృష్టించుకున్నాడని తెలిపాడు. దీనిపై పలుమార్లు స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేసినా పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.