
బస్సు డ్రైవర్‌పై ప్రయాణికుల దాడి
రైల్వేకోడూరు అర్బన్ : బస్సు డ్రైవర్‌పై ప్రయాణికులు దాడి చేయడంతో గాయాలయ్యాయి.
రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట వద్ద ప్రయాణికులు బస్సుకోసం వేచి యున్నారు. రాజంపేట డిపో ఆర్టీసీ బస్సు తిరుపతికి వెళ్తుండగా.. ప్రయాణికులు బస్సు ఆపారు. డ్రైవర్ బాషా ఆపకుండా పోవడంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్లపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఇంకా కేసు నమోదు కాలేదు.
బాలిక హత్య కేసులో
అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్
జమ్మలమడుగు రూరల్ : గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో అనుమానితులైన కొండయ్య, సురేంద్ర, బాలిక స్నేహితుడు లోకెష్‌లను పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం సిఐ నరేష్‌బాబు ఈ నెల 5న విజయవాడకు తీసుకెళ్లారు. గత మూడు రోజులుగా అనుమానితులకు పాలిగ్రాఫ్ పరీక్ష చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 10వతేదీన కోర్ట్ అనుమతి ఉండడంతో హత్య కేసు చిక్కుముడి వీడనుంది. గండికోటలో మైనర్ బాలిక హత్య జూలై 14న జరిగింది. 85 రోజులు అయినా నిందితులు ఎవరినీ పోలీస్ అధికారులు గుర్తించలేదు. సాంకేతిక సాయంతో గుర్తించాలని అగష్టు 26న జమ్మలమడుగు కోర్టులో నిందితులను హాజరుపరచారు. జడ్జి అంగీకరించడంతో ముగ్గురిని విజయవాడకు తీసుకెళ్లారు.