
బెల్ట్‌షాపులో మద్యం పట్టివేత
ములకలచెరువు : ఎక్సైజ్ పోలీసుల దా డులు జరుగుతున్నా, నకిలీ మద్యం కేసుతో అలజడి రేగినా బెల్టుషాపుల నిర్వాహకులు మాత్రం యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ములకలచెరువు మండలంలోని బురకాయలకోటలో ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దుకాణంలో నిర్వహిస్తున్న బెల్టుషాపు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ బీర్లు, మద్యం కలిపి 278 బాటిళ్లు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారయ్యాడని ఎకై ్సజ్ పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.
దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి
రాయచోటి : జిల్లాలోని దళితవాడల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాయచోటి కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గ పరిధిలోని అరవీడు గ్రామం, అలకచెరువుకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు రహదారి నిర్మిస్తామని హామీలు ఇస్తూ ఓట్లు వేయించుకొని తరువాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జ్యోతి చిన్నయ్య, మర్రి సుమిత్ర, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోల్ల మణి, కార్మిక సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బెల్ట్‌షాపులో మద్యం పట్టివేత