
ఆవు ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డుపై వెళుతున్న ఆవులు, ఉన్నట్లుండి గెంతుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు గాయపడగా, అందరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ ఆరోగ్యపురానికి చెందిన కాంతమ్మ(57), సుమంత్ (35) మదనపల్లెలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. ఊరు దగ్గరే, రోడ్డుపై వెళుతున్న ఆవు గెంతుకుంటూ వచ్చి ఒక్కసారిగా బైక్‌పై పడటంతో ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించాక, కాంతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు.
చింతలకుంటలో అగ్నిప్రమాదం
నందలూరు : మండలంలోని చింతలకుంట గ్రామం హరిజనవాడలో బల్లి ఓబులేసు అనే వ్యక్తి ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం జరగడంతో దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధితుల కథనం మేరకు ఉదయం 10 గంటల సమయంలో ఇంటిలోని ఫ్రిజ్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాప్తి చెందాయి. ఈ సంఘటనలో రూ.2.50 లక్షల బంగారు, ఇంటిలోని పలు రకాల వస్తువులు, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.10 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న రాజంపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని టి.సదుం పంచాయతీ రేకులగుంటిపల్లికి చెందిన కొత్తోళ్ల చిన్న వెంకట్రమణ (49) కనిపించడం లేదని అతని కు మారుడు మంజునాథ్ శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు. తన తండ్రి గత నెల 30న తిరుపతికి వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లాడని, ఐదు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఫిర్యాదు చేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆవు ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

ఆవు ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు