
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
రైల్వేకోడూరు అర్బన్ : మంగంపేట ఏపీఎండీసీ హైస్కూల్‌లో వాచ్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తూ అకస్మాత్తుగా మృతి చెందిన పనుపులేటి రవితేజ (29) కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కూటమి ప్రభుత్వాన్ని, ఏపీఎండీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వలేదని తెలిపారు. మృతుడి మరణానికి గల కారణాలు స్పష్టంగా చెప్పకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, నాయకులు మృతుడి కుటుంబాన్ని కలిసినా ఏమాత్రం హామీ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇలా జరిగితే గంటల్లో 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని కానీ కూటమి నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ఇవ్వకుంటే నిరననలు చేస్తామని హెచ్చరించారు.