
సిద్దవటం కోటలో అడవి పందుల స్వైరవిహారం
సిద్దవటం : మండల కేంద్రంలోని మట్లి రాజుల కోటలో అడవిపందులు రాత్రి వేళలో స్వైరవిహారం చేస్తున్నాయి. సిద్దవటం కోట రాను రాను మట్టిలో కలుస్తుందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. డంకానగర్, పార్కులు, బిస్మిల్లా షా ఖాద్రి దర్గా సమీపంలోని రహదారి పక్కన అడవి పందులు పెద్ద గుంతలు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. కోటలోని కట్టడాలు కూడా పడిపోతున్నా పురవాస్తు శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదు. సిబ్బంది కేవలం నోటుబుక్కులలో పర్యాటకుల పేర్లు నమోదు చేసుకుని వెళ్లిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.