
అంబులెన్స్ ఢీకొని ఆర్‌ఎంపీ మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో నివాసముంటున్న ప్రముఖ ఆర్‌ఎంపీ నార్జా ల నరేంద్రరావు శనివారం తెల్లవారుజామున పట్టణలోని గంగాలమ్మ ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ఢీకొని మృతి చెందాడు. కేసున మోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెలిపారు. పలువురు మృతదేహాన్ని సందర్శంచి నివాళులు అర్పించారు.
మూడు వాహనాలను
ఢీకొట్టిన లారీ
– తప్పిన పెను ప్రమాదం
పీలేరు రూరల్ : వేగంగా వస్తున్న లారీ వరుసగా మూడు వాహనాలను ఢీకొట్టి.. బీభత్సం సృష్టించింది. అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు వైపు నుంచి ఎర్రగుంట్లకు వెళుతున్న లారీ.. కర్నూలుకు చెందిన దంపతులు ఎం.యతేంద్ర వర్మ, పి.అరుణదావి కారులో చిత్తూరుకు వస్తుండగా ఢీకొట్టింది. అనంతరం అదే లారీ మరో లారీ, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎం.యతేంద్ర వర్మ, పి.అరుణదావి గాయపడ్డారు. వారిని స్థానికులు పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవరు, మరో లారీ డ్రైవరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకే సారి నాలుగు వాహనాలు ఢీకొనడంతో ట్రాఫిక్ స్తంభించింది.
మనస్తాపంతో
వృద్ధుడి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్యం, మతిమరుపుతో బాధపడుతున్న తనను భార్య అకారణంగా తిడుతోందనే కోపంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె మండలంలో జరిగింది. కొత్త ఇండ్లు పంచాయతీ రంగారెడ్డి కాలనీకి చెందిన బండ్ల నరసింహులు(69) కొంత కాలంగా షుగర్, మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నాడు. సమయానికి మాత్రలు వేసుకోకపోవడం, వ్యాధిని ముదరబెట్టుకుంటుండటంతో భార్య గంగులమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహులు, అలిగి, బుధవారం సాయంత్రం కొత్త ఇంటి సమీపంలోని బహిరంగ ప్రదేశానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్మకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అతడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు పొందుతూ నరసింహులు గురువారం మృతి చెందాడు. తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘర్షణ.. బైక్ దగ్ధం
పుల్లంపేట : మండల పరిధిలోని తిప్పాయపల్లి గ్రామంలో ఇరువురు ఘర్షణ పడ్డ ఘటనలో బైక్ దగ్ధమైనట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన అంజిరెడ్డి అనే వ్యక్తి గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని అనడంతో.. జగన్మోహన్‌రెడ్డి దాడి చేసి బైక్ దగ్ధం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అంబులెన్స్ ఢీకొని ఆర్‌ఎంపీ మృతి

అంబులెన్స్ ఢీకొని ఆర్‌ఎంపీ మృతి