
కారు ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కారు ఢీకొని కర్నాటకకు చెందిన అన్నదమ్ములు తీవ్రగాయాలపాలైన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. కర్నాటక చేలూరు తాలూకా బైరప్పనహళ్లికి చెందిన మంజునాథరెడ్డి కుమారుడు మనీష్(25), శంకరరెడ్డి కుమారుడు శశి(17) వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరూ బోయకొండకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. కురబలకోట మండలం కంటేవారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం గాయాలపాలైన శశిని మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
నాపై పోలీసులు దాడి చేశారు
కడప అర్బన్ : హోటల్‌లో భోజనం చేస్తుండగా మైదుకూరు పోలీసులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మైదుకూరు మండలం జీవీ.సత్రానికి చెందిన కాకాని సాంబశివ ఆరోపించారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం తమ గ్రామానికి సమీపంలో భోజనం చేస్తున్నాననే గానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నా లాఠీలతో చితకబాదారని తెలిపారు. ప్రస్తుతం రిమ్స్‌లో గాయాలతో చికిత్స పొందుతున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన శశి
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మోనిష్

కారు ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు

కారు ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు