
వాహనం ఢీకొని మహిళ మృతి
కలకడ : గుర్తుతెలియని వాహనం ఢీకొని జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన పెద్దరెడ్డెప్ప భార్య శెట్టిపల్లె జయమ్మ(54) మంగళవారం పొలం వద్దకు నడచి వెళ్తోంది. మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయమ్మ బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ..
కలికిరి : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కలికిరి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన పాలగిరి నూరుల్లా తన భార్య షరీఫా(46)తో కలిసి ద్విచక్ర వాహనంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి క్రాస్ రోడ్డుకు బయలుదేరారు. వెనుకవైపు నుంచి వచ్చిన మదనపల్లె డిపో బస్సు వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షరీఫాను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.
కారు ఢీకొని ఒకరు దుర్మరణం
సంబేపల్లె : మండలంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఓ కారు స్కూటర్‌ను డీ కొన్న ప్రమాదంలో భాస్కర్‌రెడ్డి(77) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కలకడ మండలం బాలయ్యగారిపల్లెకు చెందిన నగిరిమడుగు భాస్కర్‌రెడ్డి స్కూటర్‌లో సొంత పనుల నిమిత్తం కలకడకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బాలయ్యగారిపల్లె క్రాస్ సమీపంలో రాయచోటి నుంచి చైన్నెకి వెళ్తున్న కారు స్కూటర్‌ను ఢీకొనడంతో భాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటితాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహిళ అదృశ్యం
ఎర్రగుంట్ల : మండలంలోని హనుమనుగుత్తి గ్రామానికి చెందిన దుద్దేల శ్యామల(42) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. శ్యామలకు మతిస్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చి కనిపించలేదు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.

వాహనం ఢీకొని మహిళ మృతి

వాహనం ఢీకొని మహిళ మృతి

వాహనం ఢీకొని మహిళ మృతి