
వృద్ధురాలి హత్యకేసులో సంచలన తీర్పు
రాజంపేట : ఎర్రబల్లికి చెందిన నర్రెడ్డి సమిత్రమ్మ(60) హత్య కేసులో రాజంపేట మూడో అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితురాలు వెలమచల ఇందిరమ్మకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. పట్టణ సీఐ నాగార్జున, ఎస్‌ఐ వెంకటేశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 2019 మే, 2న తన తల్లి నరెడ్డి సుమిత్రమ్మను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంట్లో బంగారు వస్తువులను దోచుకెళ్లారని మృతురాలి కుమారుడు నర్రెడి్‌డ్ మహీధర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్పటి సీఐ నిరంజన్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సీఐ దర్యాప్తు చేసి 2020 మార్చి, 9న వెలచలమల ఇందిరమ్మ(దేవరపల్లె, వెలిచలమల్ల పంచాయితీ,నంబూలపూలకుంట మండలం,అనంతపురం జిల్లా), నర్రెడ్డి శ్వేత(ఎర్రబల్లి,రాజంపేటటౌన్), ఓర్సు నాగరాజు (డ్రైవర్, కొండ్లవాండ్లపల్లె,నంబూపూలకుంట మండలం, అనంతపురం), మల్లెల రమేష్ (కూలి, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం, అనంతపురం), ఒర్సు మల్లికార్జున (డ్రైవర్, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం అనంతపురం)లను అరెస్టు చేశారు. వారి వద్ద మృతురాలికి చెందిన సరుడు, రెండు గాజులు, డైమండ్ నెక్లస్, జత కమ్మలు, రెండు వెండి దీపాలు, హత్యకు ఉపయోగించిన దిండు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు. తదుపరి సీఐ చంద్రశేఖర్ వారిపై చార్జ్‌షీట్ దాఖలు చేయగా మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలు నిజమని తేలడంతో వెలిచెలమల ఇందిరమ్మ(47)కు జీవిత ఖైదు విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో నేరారోపణ రుజువు కానందున నర్రెడ్డి శ్వేత, ఒర్సు నాగరాజు, మల్లెల రమేష్, ఒర్సు మల్లికార్జున (విచారణలో మరణం)లకు విముక్తి కలిగించారన్నారు. సీఐ నిరంజన్‌కుమార్, హనుమంత్‌నాయక్, ఎం.చంద్ర శేఖర్, పీపీ షేక్‌జానీ, ప్రస్తుత పీపీ కొమ్మినేని వేణుగోపాల్, జీ.సుబ్బరాయుడు, ఏఎస్‌ఐ శంకరయ్యలను రాజంపేట ఎఎస్పీ మనోజ్‌రామ్‌నాథ్‌హెగ్డే అభినందించారని వెల్లడించారు.
కేసులో ఇందిరమ్మకు జీవిత ఖైదు