
పింఛా ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్
వివరాలు తెలుసుకుంటున్న సబ్ కలెక్టర్ భావన
నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు
సుండుపల్లె : మండలంలోని పింఛా ప్రాజెక్టును రాజంపేట సబ్ కలెక్టర్ భావన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, ఇప్పటివరకు జరిగిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు వచ్చే జల వనరులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి పంపిణీ తీరుపై ఆరా తీశారు. ప్రాజెక్టు వద్ద వాతావరణం ఆహ్లాద కరంగా ఉందని, పర్యటకులకు మరిన్ని వసతులు కల్పించి పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు.
నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టిరోడ్డు
సుండుపల్లె : పింఛా ప్రాజెక్టు పైభాగంలో మోస్తరు వర్షాలు పడడంతో ప్రాజెక్టులోకి వరదనీరు చేరింది. దీంతో నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ ప్రవాహానికి రాయవరం బహుదా నదిపై ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

పింఛా ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్