
వాన.. వెల్లువాయె!
మండలం వర్షం (మిమీ)
రాయచోటి: అల్పపీడన ప్రభావంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తారుకు పైగా వర్షం కురిసింది. రెండు రోజులుగా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటం వర్షాధార పంటలకు ఊతమైంది. జిల్లాలోని 23 మండలాల్లో మోస్తరు వర్షం కురవగా మిగిలిన ఏడు మండలాల్లో చిరుజల్లులతో సరిపెట్టుకుంది. మామిడి, బొప్పాయి, కర్బూజా, వరి, వేరుశనగ, టమాటా, ఇతర కూరగాయలు, పూల తోటలకు ఈ వర్షం రాక ఎంతో ఊరటనిచ్చింది. చీడపీడలతో ఉన్న వరిపంటకు కలిసి వస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని తంబళ్లపల్లెలో 86.2 మిమీ వర్షపాతం, సంబేపల్లిలో 83.6 మిమీ వంతున అధికంగా వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయానికి పెనగలూరు, చిట్వేలి, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కురబలకోట, పీలేరు, కలకడ మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదైంది.
పెద్దమండెం 50.6
చిన్నమండెం 46.6
గుర్రంకొండ 45.8
బి.కొత్తకోట 32.2
పెద్దతిప్పసముద్రం 31.6
ములకలచెరువు 26
రామాపురం 25.6
వీరబల్లి 25.4
రాయచోటి 24.8
లక్కిరెడ్డిపల్లి 23
పుల్లంపేట 20.6
నిమ్మనపల్లి 19.2
టి.సుండుపల్లి 15.4
రామసముద్రం 13.2
గాలివీడు 12.8
మదనపల్లి 9.2
నందలూరు 7.4
వాల్మీకిపురం 7.2
కేవీ పల్లి 6.4
కలికిరి 3.2
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
రెండు రోజులుగా.. మోస్తరుగా..
వర్షాధార పంటలకు ఊతం