
రాకపోకలకు అంతరాయం
సుండుపల్లె మండలంలో రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. ఊటచెరువు నిండి మొరవలో నీరు అధికంగా వస్తోంది. దీంతో మండల కేంద్రం నుంచి గుండ్లపల్లికు వెళ్లే రహదారి వడ్లపల్లె సమీపంలో.. ప్రధాన రహదారిపై తూముల దగ్గర మట్టి రోడ్డుపైన నీరు అధికంగా వచ్చి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ మెహబూబ్‌చాంద్, పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించారు. వాహనదారులు, ప్రజలను అటువైపు వెళ్లనీయకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఇలాగే ఉంటే రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. –సుండుపల్లె
చిన్నమండెం మండల పరిధిలోని మాండవ్యనది జలకళ సంతరించుకుంది. నదికి భారీగా నీరు వచ్చింది. నీటి ప్రవాహం వేగంగా సాగుతోంది.
– చిన్నమండెం

రాకపోకలకు అంతరాయం