
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవో ఇవ్వాలి
రాయచోటి : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం కాదని, వాటిని అమలు పరచడానికి జీఓను విడుదల చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఎగ్జిక్యూటీవ్ సమావేశాన్ని జిల్లా కార్యదర్శి బీసీ శేఖర్, జిల్లా అధ్యక్షులు సి.ఆనందబాబు అధ్యక్షతన రాయచోటిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జీవీ నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన డీఏ అరియర్స్, పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ బకాయిలు, కొత్త పీఆర్‌సీ ఇవ్వాలన్నారు. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను తొమ్మిది నెలలుగా చెల్లించకుండా పెండింగ్ పెట్టారన్నారు. వెంటనే వాటిని చెల్లించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌పీ బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు పి.నాగభూషణంరెడ్డి, జోనల్ నాయకులు వీటీ నాథ్, జీఎస్ మన్యం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు కేవీ రమణ, జిల్లా వైస్ ప్రెసిడెంటు శరత్ బాబు, జిల్లా కోశాధికారి కొండా ఈశ్వర్‌రెడ్డి, జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంటు వి.ప్రకాష్, జిల్లా ప్రచార కార్యదర్శి కె.చలమారెడ్డి, జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, ఎంఎస్ వాసులు, సుగుణ, సెల్వి, మెయింటినెన్స్ కమిటీ సభ్యులు సి.నరసింహులు, జిల్లాలో ఐదు డిపోలకు చెందిన ముఖ్య నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.