
మిద్దైపె నుంచి పడి కార్మికుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి జారిపడి భవన నిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. పట్టణంలోని గౌతమీ నగర్‌కు చెందిన ఎల్లప్ప కుమారుడు శ్రీనివాసులు(25) భవన నిర్మాణ పనుల్లో భాగంగా కమ్మీ పని చేస్తున్నాడు. గురువారం సీటీఎంలో ఓ ఇంటిపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నిటారుగా కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని రాయచోటి–వేంపల్లి రహదారి మార్గంలోని మర్రిచెట్టు వద్ద గురువారం ఉదయం చైన్నెకు వెళ్తున్న కారు ఢీకొని చైతన్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన చైతన్య కొత్తపల్లిలో నివాసముంటున్నారు. గాయపడిన చైతన్యను స్థానికులు మెరుగైన చికిత్సకోసం కడప రిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
చిన్నమండెం : మండలంలోని కలిబండ గ్రామం కొల్లవాండ్లపల్లెకు చెందిన రైతు ఈశ్వర్‌రెడ్డి(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈశ్వర్‌రెడ్డి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.
పిడుగు పడి ఇల్లు ధ్వంసం
నిమ్మనపల్లె : పిడుగు పడి ఇల్లు ధ్వంసమైన సంఘటన నిమ్మనపల్లె మండలంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటాక మండలంలో కురిసిన వర్షానికి అగ్రహారం పంచాయతీ బండమీదపల్లె హరిజనవాడలో వెంకటరమణకు చెందిన ఇంటిపై పిడుగుపడింది. ఆ సమయంలో వెంకటరమణ భార్య సరోజతోపాటు బయట ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంటి గోడలు, పైకప్పు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసమై పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. బాధితుడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేయగా ఎస్‌ఐ తిప్పేస్వామి, ఆర్‌ఐ రమేష్, వీఆర్వో ప్రవీణ్‌కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నష్టంపై అంచనా వివరాలతో నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.

మిద్దైపె నుంచి పడి కార్మికుడికి గాయాలు

మిద్దైపె నుంచి పడి కార్మికుడికి గాయాలు

మిద్దైపె నుంచి పడి కార్మికుడికి గాయాలు