మెరుగైన వైద్య సేవలు అందించండి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించండి

Aug 8 2025 7:59 AM | Updated on Aug 8 2025 7:59 AM

మెరుగ

మెరుగైన వైద్య సేవలు అందించండి

మదనపల్లె రూరల్‌: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ లక్ష్మీనరసయ్య ఆదేశించారు. గురువారం పట్టణ పరిధి నిమ్మనపల్లె రోడ్డులోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్‌ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి స్క్రీనింగ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ కీర్తిప్రియ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

హర్‌ఘర్‌ తిరంగాపై ర్యాలీ

రాయచోటి: స్వాతంత్య్ర ఫలాలు, వాటి విలువలు, త్యాగాలను స్మరించుకునేందుకు హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు నోడల్‌ అధికారి నాగభూషణం పేర్కొన్నారు. గురువారం ఉదయం రాయచోటి పురపాలక సంఘం, పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ, జిల్లా పర్యాటక తదితర శాఖల ఆధ్వర్యంలో రాయచోటిలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

‘అక్షర ఆంధ్ర’పై శిక్షణ

రాయచోటి టౌన్‌: అక్షర ఆంధ్ర అనే కార్యక్రమంపై రాయచోటి డైట్‌ కేంద్రంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్య నోడల్‌ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ అక్షర ఆంధ్ర, ఉల్లాస్‌ (సమాజంలోని అందరికీ జీవిత కల అభ్యాసంపై అవగాహన) అంశాల ద్వారా వివిధ వృత్తులలో ఉన్న 15 ఏళ్లు పైబడిన వయోజనులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా ఎస్‌హెచ్‌జీ లబ్ధిదారులు, ఆయాలు, వంట వండేవారు, వివిధ రకాల సహాయకులు, కాపలాదారులు వంటి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీడీఆర్‌డీఏ సత్యనారాయణ, ఏపీఎంలు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఉపాధి హామీ ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

‘సూర్యఘర్‌’పై

అవగాహన కల్పించాలి

రాజంపేట రూరల్‌: ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని విద్యుత్‌శాఖ సీజీ ఎం.జానకీరామ్‌ ఆదేశించారు. రాజంపేటలోని డివిజనల్‌ విద్యుత్‌శాఖ కార్యాలయంలో గురువారం విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్‌ శాఖ ఎస్‌సీ ఆర్‌ చంద్రశేఖరరెడ్డి, డీఈఈ ఎన్‌ రాజశేఖరరెడ్డి, డీఈలు సురేంద్రనాథ్‌, భాస్కరరావు, మురళీధర్‌రెడ్డి, ఏఈలు ఏంవీ చంద్రశేఖర్‌, కుమార్‌, ఈశ్వరరాజు, షఫీ, శ్రీనివాసులు, యోగనాందం, సుబ్రమణ్యం, కిరణ్‌కుమార్‌, చలపతీ, బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ బిల్లు ఆదా

రాయచోటి జగదాంబసెంటర్‌ : ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంతో వినియోగదారులకు విద్యుత్‌ బిల్లు ఆదా అవుతుందని ఏపీఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జానకిరామ్‌ పేర్కొన్నారు. రాయచోటి పట్టణం మాసాపేటలోని శ్రీ సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంపై విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ రాయచోటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి.యుగంధర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, పలు శాఖల బ్యాంకు మేనేజర్లు, పీఎం సూర్యఘర్‌ వెండార్స్‌ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలు  అందించండి  1
1/2

మెరుగైన వైద్య సేవలు అందించండి

మెరుగైన వైద్య సేవలు  అందించండి  2
2/2

మెరుగైన వైద్య సేవలు అందించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement