
బలమైన నమ్మకానికి ప్రతీక భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్
బి.కొత్తకోట : బలమైన నమ్మకం, పటిష్ట దృఢత్వం, వినియోగదారుల నమ్మకానికి భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ప్రతీకగా నిలుస్తుందని భారతీ సిమెంట్ టెక్నికల్ మేనేజర్ సి.చాయాపతి అన్నారు. స్థానిక బైపాస్‌రోడ్డులోని భగవాన్ సాయిరాం స్కూల్ ఎదురుగా భారతి సిమెంట్ డీలర్, ఎస్‌ఎల్‌వీ ఎంటర్ ప్రైజస్ అండ్ బోర్‌వెల్స్ నిర్వాహకులు సి.వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తాపీ మెసీ్త్రలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాయాపతి మాట్లాడుతూ భారతీ సిమెంట్ ప్రత్యేకతలు, నాణ్యతా ప్రమాణాలు, విశిష్ట అంశాలను వివరించారు. సిమెంట్ తయారీ విధానం, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేసీ్త్రలు పాటించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ సాంకేతిక నిపుణులు పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతీ ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. టెంపర్ ఫ్రూఫ్ బస్తాలతో మార్కెట్‌లోకి ఇస్తున్నందున తూకం తగ్గడం ఉండదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదన్నారు. సిమెంట్ రంగంలో భారతీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అనంతరం మెసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఎం.సుబ్బరాయుడు, డీలర్ సి.వేణుగోపాల్‌రెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు.