
హమాలీ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం
మదనపల్లె రూరల్ : టమాటా మార్కెట్‌లో హమాలీగా పనిచేస్తూ, ప్రమాదవశాత్తు లారీ కిందపడి మృతి చెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన హమాలీ కుటుంబానికి మదనపల్లె టమాటా మార్కెట్‌యార్డ్ హమాలీ వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎన్‌టీయూసీ గౌరవాధ్యక్షుడు ఎస్.ఏ.మస్తాన్, రూ.2లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ కాశీగంజ్‌జిల్లా నంగులాతానాకు చెందిన మోర్‌సింగ్(48) ఐదేళ్లుగా నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉంటూ స్థానికంగా టమాటా మార్కెట్‌లో హమాలీగా పని చేసేవాడన్నారు. జూలై 24వ తేదీ రాత్రి జరిగిన ప్రమాదంలో లారీ చక్రాల కిందపడి మోర్ సింగ్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడన్నారు. యూనియన్ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానించుకుని మృతుని కుటుంబ సభ్యులకు రూ.2లక్షల ఆర్థికసహాయం అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రామయ్య, ఉపాధ్యక్షుడు రసూల్, కార్యదర్శి మహబూబ్‌బాషా, మురాషా, చలపతి, షామీర్, సుధాకర్, బావాజాన్, సుబ్బు, రోషన్, శివ, జాఫర్, కుర్షిద్, అరవింద్, కార్మికులు పాల్గొన్నారు.