
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం కలకడలో జరిగింది. ఎస్‌ఐ రామాంజనేయులు కథనం మేరకు...కలికిరి మండలం మేడికుర్తి గ్రామానికి చెందిన ఆర్.దస్తగిరిసాబ్ కుమారుడు ఆర్.అబ్దుల్‌రహిమాన్(55) తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం కలకడలో పని ముగించుకుని వెళ్తుండగా వర్షం కురవడంతో ఆగిపోయారు. మరుసటిరోజు బుధవారం ఉదయం 4–30 గంటల సమయంలో కలికిరి వైపు నడచి వెళ్తుండగా కలకడ హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రగాయాలైన అబ్దుల్‌రహిమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రెహనా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తన స్థలం ఆక్రమిస్తున్నారని మహిళ వినతి
కురబలకోట : తమ స్థలంలో దౌర్జన్యంగా మరొకరు పాగా వేసి అక్రమంగా కట్టడం నిర్మించారని కురబలకోటకు చెందిన బాధిత మహిళలు పర్విన్, రేష్మా బుధవారం కలెక్టర్‌కు విన్నవించారు. వారి కథనం మేరకు..మండలంలోని దొమ్మన్నబావి హైవే పక్కన వారికి రూ.4 కోట్లు విలువైన 28 సెంట్ల స్థలం ఉంది. ఇటీవల అదే ఊరికి చెందిన ఒకరు దౌర్జన్యంగా ఆక్రమించి కట్టడం నిర్మించారు. అభ్యంతరం చెబితే తమపై దౌర్జన్యానికి వచ్చారని బాధితులు తెలిపారు. ఆక్రమణదారుడికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని వాపోతున్నారు. సర్వే నిర్వహించి న్యాయం చేయాలని కోరారు.
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
నందలూరు : రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట నందలూరు పోలీసులను ఆశ్రయించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని టంగుంటూరు గ్రామానికి చెందిన చలమాల నవీన్ కుమార్, పులివెందుల మండలం భాకరపురం గ్రామానికి చెందిన సయ్యద్ మనీషా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చి రాజంపేట సమీపంలోని పోలిచెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంనంతరం తమ బంధువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తమను ఆశ్రయించారని ఎస్‌ఐ తలెఇపారు. ఇరువురి కుటుంబీకులను పిలిపించి ఘర్షణలకు పాల్పడకుండా సామరస్యంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి