
గండికోట డ్యాంలో గుర్తుతెలియని శవం లభ్యం
కొండాపురం : గండికోట ప్రాజెక్టు నీటిలో రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని ఓ యువకుడు శవం బుధవారం లభ్యమైనట్లు కొండాపురం ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. మండలంలోని పాత కొండాపురం–ఏటూరు వైపు వెళ్లే పాతదారి వద్ద రైల్వే వంతెన సమీపంలో గండికోట జలాశయం వెనుక జలాల్లో 4.5 అడుగుల గుర్తుతెలియని మృత దేహం కనిపించడంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకొని మృత దేహాన్ని బయటికి తీశారు. మృతుడు జీన్స్ ఫ్యాంట్ ధరించాడని, వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మద్య ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే ఎస్‌ఐ 9121100612, సీఐ 9121100611 ఫోన్లకు సమచారం ఇవ్వాలని తెలిపారు.