
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీశాఖ అధికారి వై.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం సెక్షన్ సుండుపల్లె బీట్ పరిధిలోని సద్దికూళ్లవంక చెక్‌పోస్టు దగ్గర అటవీశాఖ అధికారులు నాకాబందీ నిర్వహించారు. ఒక హుండాయ్ కారు వేగంగా వచ్చి బారిగేట్ వేసిన విషయం పసిగట్టి సుండుపల్లె మార్గంలోకి వెళ్లగా అటవీ సిబ్బంది వెంబడించారు. సిబ్బందిని చూసి వాహనాన్ని నిలిపి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనం తనిఖీ చేయగా అందులో 326 కేజీలు గల పది ఎర్రచందనం దుంగలున్నాయి. ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకుని పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్‌ఓ రమేష్‌బాబు, ఎఫ్‌బీఓ అంజన స్వామి, గౌషా, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.