
ఇన్‌స్ఫైర్ మనక్ ఓరియంటేషన్‌కు హాజరుకావాలి
రాయచోటి : డివిజనల్ స్థాయి ఇన్‌స్ఫైర్ మనక్ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం కోరారు. అన్నమయ్య జిల్లాలోని మూడు డివిజన్లలో ఇన్‌స్ఫైర్ మనక్ అవార్డు నామినేషన్లకు సంబంధించి అవగాహన తరగతులు గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయచోటిలోని డైట్, మదనపల్లి, రాజంపేట జెడ్పీ పాఠశాలల్లోనూ శిక్షణా తరగతులు ఉంటాయని, ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడు ఓరియంటేషన్‌కు హాజరు కావాలన్నారు.
పీజీ కోటాను తగ్గించడం దారుణం
ఓబులవారిపల్లె : 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లకు పీజీ కోటాను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం దారుణమని వైద్యాధికారులు గురు మహేష్, డాక్టర్ రాజశేఖర్ అన్నారు. విలేకరులతో వారు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం లేకుండా మీడియా ద్వారా నిర్ణయాన్ని తెలియజేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యులను ఇది తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మారుమూల గ్రామాలలో పనిచేస్తున్న వైద్యుల సంఖ్యపై ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను మోసగించిందని, వెంటనే తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని వారు కోరారు.
ఊయలే.. ఉరితాడై
– గొంతుకు బిగుసుకుపోయి బాలిక మృతి
జమ్మలమడుగు : సరదాగా ఆడుకునే ఊయలే.. గొంతుకు బిగుసుకుపోయి అరీఫా(9) ప్రాణం తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప చనిపోవడంతో ఇంటిల్లిపాదీ కన్నీరు మున్నీరయ్యారు. ఎర్రగుంట్ల పట్టణం వినాయకనగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను విషాదంలో నింపింది. సీఐ నరేష్‌బాబు వివరాల మేరకు.. వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న అలీబాషా స్థానిక నాపరాయి గనిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కుమార్తె ఆరీఫా పట్టణంలోని ప్రభు త్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సా యంత్రం స్కూల్‌నుంచి వచ్చిన ఆరీఫా ఇంట్లో ఎవ రూ లేకపోవడంతో ఊయలతో సరదాగా ఆడుకుంటోంది. ఈ సందర్భంగా చీర ఊయల మెడకు బిగించుకుపోవడంతో ఊపిరాడక మరణించింది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు పాపను చూసి సృహ కో ల్పోయిందని భావించి ఆసుపత్రికి తీసుకుపోయారు. వైద్యులు పరీక్షించి ఆరీఫా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పాప మరణం స్థానికులను కలవరపెట్టింది.

ఇన్‌స్ఫైర్ మనక్ ఓరియంటేషన్‌కు హాజరుకావాలి