
‘ఇరగంరెడ్డి’ నామినేషన్ దాఖలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట, పులివెందుల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు గురువారం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరుపున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, టక్కోలు శివారెడ్డి, చేశారు. జనసేన పార్టీ తరుపున కోనేటి హరి వెంకట రమణ, స్వతంత్య్ర అభ్యర్థిగా వై.మధుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీసీఈఓ ఓబులమ్మకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి,, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడె టక్కోలు శివారెడ్డి, రాజంపేట నియోజకవర్గం యూత్ వింగ్ అధ్యక్షుడు కుండ్ల ఓబుల్ రెడ్డి, పార్టీ నాయకులు మేకపాటి నందకిషోర్ రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ దున్నుతల లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
● ఒంటిమిట్టలో ఏలేశ్వరం మధుమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కడప సిఈఓ కార్యాలయంలో ఓబులమ్మకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
● పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరుపున తుమ్మల హేమంత్‌రెడ్డి రెండు, తుమ్మల ఉమాదేవి రెండు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఓబులమ్మకు సమర్పించారు. దీంతో రెండోరోజు నాటికి 13 నామినేషన్లు దాఖలయ్యాయి.

‘ఇరగంరెడ్డి’ నామినేషన్ దాఖలు