
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు
సిద్దవటం : ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటంలోని అటవీ శాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ ఎర్రచందనం, వన్యప్రాణులకు సంబంధించి గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది తరచూ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ కళావతి, డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సురేష్‌బాబు, ఎఫ్‌బీఓలు, ఏబీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్