
అత్యాచార యత్నం కేసులో మూడు నెలల జైలు
రాయచోటి టౌన్ : లక్కిరెడ్డిపల్లె మండలంలో ఒక మహిళపై అత్యాచారానికి యత్నించిన కేసులో పత్తి సుధాకర్ అనే వ్యక్తికి రాయచోటి ఏజేఏస్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఇ.ప్రసూన మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేలు జరిమానా విధించినట్లు లక్కిరెడ్డిపల్లె పోలీసులు తెలిపారు. 2011 సంవత్సరం నవంబర్ 12న 12.11.2011వ సంవత్సరంలో లక్కిరెడ్డిపల్లె మండలంలో ఒక మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్ష విధిస్తారనేందుకు ఈ కేసు ఒక నిదర్శనమన్నారు.