
గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో యామవరం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని శివప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. యామవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ రహదారి పక్కన నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను రహదారి పక్కనే వున్న లోతట్టు ప్రాంతంలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో క్షతగాత్రుని కాలు విరిగినట్లు, మరో కాలికి తీవ్ర గాయమైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు.
13 మంది జూదరుల అరెస్టు
చిన్నమండెం : మండల పరిధిలోని చిన్నర్సుపల్లె ఎగువచెరువు వద్ద జూదమాడుతున్న 13 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. వద్ద నుండి రూ.2,59,500 నగదు, 16 సెల్‌ఫోన్లు, 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
భూ వివాదంలో
పరస్పర దాడులు
మదనపల్లె రూరల్ : మండలంలోని కొత్తవారిపల్లె గ్రామానికి చెందిన మహేష్, నాగరాజు భూవివాదంలో ఘర్షణ పడి మంగళవారం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీనిపై మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
ములకలచెరువు : కుటుంబ కలహాలతో ఒక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పర్తికోటకు చెందిన శ్రీనివాసులు భార్య రేఖ(31) కుటుంబ కలహాలతో విషం తాగి ఇంటిలో అపస్మారక స్థితిలో పడివుంది. కుటుంబ సభ్యులు గమనించి 108 సహాయంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీఆర్‌ఓ గదిలో చోరీ యత్నం
రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ కార్యాలయ గదిలో సోమవారం రాత్రి దొంగలు చోరీ యత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. బీరువా తాళాలతో పాటు టేబుల్ ర్యాక్ కూడా పగుల గొట్టారు. అందులో ఏమీ లేకపోవడంతో వెళ్లిపోయారు. అయితే రికార్డులు మాత్రం చిందరవందరగా పడేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు