
రైలు నుంచి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు
కురబలకోట : నడుస్తున్న రైలు నుంచి కింద పడి విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం సాయంత్రం కురబలకోట రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాషా కథనం మేరకు..సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన సఫాన్ (18) తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్ద రెండు రోజుల పాటు వుండి మంగళవారం తిరిగి తిరుపతి కళాశాలకు కదిరి నుంచి రైలులో బయలు దేరాడు. మార్గమధ్యంలోని కురబలకోట రైల్వే స్టేషన్ పరిధిలోని సింగన్నగారిపల్లె సమీపంలో డోర్ పక్కనుంచి ప్రమాదవశాత్తు పట్టు జారి కిందపడి గాయపడ్డాడు. 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.