
ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కావాలని ప్రార్థనలు
ఓబులవారిపల్లె/గుర్రంకొండ : అక్రమంగా అరెస్టయి జైలులో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల కావాలని కోరుతూ మంగళవారం ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నీరుంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన నిర్వహించామన్నారు. మంగంపేట గ్రామస్తులు వెంకటరెడ్డి, రవి శంకర్‌రెడ్డి, గల్లా శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు ఆజాం, ఇర్ఫాన్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీ మహిళలు..
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మండలంలోని మర్రిపాడు గ్రామానికి చెందిన ముస్లీమ్ మైనార్టీ మహిళలు మంగళవారం స్థానిక హాసార్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షెహనాజ్‌బేగం, బషీరున్నిసా, మహబూబ్‌జాన్, జెహదున్నిసా, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కావాలని ప్రార్థనలు