
మాండవ్య నదిని శుభ్రపరచండి
రాయచోటి అర్బన్ : పట్టణం నడిబొడ్డున మురుగునీటి గుంటగా మారిన మాండవ్య నదిని శుభ్రం చేయాలని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర నేత టి.ఈశ్వర్, పౌర హక్కుల సంఘం నేత పి.రెడ్డెయ్య డిమాండ్ చేశారు. మాండవ్య నదిని బుధవారం వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాండవ్య నదిలో మురుగు చేయడంతో దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిందన్నారు. దోమల వ్యాప్తితో పట్టణ వాసులు విష జ్వరాలతో రాయచోటి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేక తల్లడిల్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి థియేటర్ నుంచి చల్లంపల్లె వరకు నదిలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం యుద్ధప్రాతిపదికన తొలగించి, కాల్వలకు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత రామాంజనేయులు, బాస్ రాష్ట్ర కార్యదర్శి తాతయ్య, న్యాయవాదులు ధనుంజయ ఆనంద్, చిన్నయ్య, రవిశంకర్, చంద్రశేఖర్, మారుతి, చల్లా రెడ్డెయ్య, రమేష్ బాబు, శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.