సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ తాజాగా ఎక్స్ వేదికగా..‘నానా పటేకర్ మరణవార్త తీవ్రంగా కలచివేసింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. విభిన్న పాత్రల్లో, విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నానాపటేకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
Deeply saddened by the passing of Nana Patekar Ji. His remarkable contribution to Indian cinema and his versatile performances will always be remembered. My heartfelt condolences to his family, friends, and countless admirers. May his soul rest in peace. https://t.co/Z72B1PTrka
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2026
ఇదీ చదవండి: కార్గిల్‌వార్‌లో 60 రోజులు.. రైతులకోసం నామ్ ఫౌండేషన్


