నా భర్త నుంచి నాకు విముక్తి కల్పించండి..! | woman seeks freedom from husband | Sakshi
Sakshi News home page

నా భర్త నుంచి నాకు విముక్తి కల్పించండి..!

May 20 2026 1:07 PM | Updated on May 20 2026 1:12 PM

woman seeks freedom from husband

తిరుపతి జిల్లా: తన భర్త నుంచి తనకు విముక్తి కల్పించి, న్యాయం చేయాలని అధికారపార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ భార్య షామీన అధికారులను వేడుకుంటున్నారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు తన భర్తకు ఐదేళ్ల కిందట వివాదం జరిగి కోర్టులో కేసులు నడుస్తున్నట్లు తెలిపారు. 

ఈ కేసులు హీరింగ్‌కు రావడంతో తనను ఇబ్బందులకు గురిచేసేందుకు రెండు రోజుల క్రితం తన నివాసం వద్దకు చేరుకుని దాడి యత్నం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు. తామే దాడి చేసినట్లు పోలీసులకు తమపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  గతంలో ఇదే విధంగా జరిగితే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అంతేగాకుండా తన కుమారుడిని రెండేళ్ల నుంచి తన భర్త వద్దనే పెట్టుకుని ఉన్నాడని, తనని చూడనియకుండా ఆంక్షలు విధించారని తెలిపారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement